Share News

Natco Pharma: దక్షిణాఫ్రికా కంపెనీపై నాట్కో ఆసకి

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:14 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే నాట్కో ఫార్మా వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణా ఫ్రికాకు చెందిన ఫార్మా కంపెనీ యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ హోల్డింగ్స్‌ ఈక్విటీలో 36 శాతం మైనారిటీ వాటా కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

Natco Pharma: దక్షిణాఫ్రికా కంపెనీపై  నాట్కో ఆసకి

  • రూ.2,100 కోట్లు చెల్లించేందుకు రెడీ

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే నాట్కో ఫార్మా వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణా ఫ్రికాకు చెందిన ఫార్మా కంపెనీ యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ హోల్డింగ్స్‌ ఈక్విటీలో 36 శాతం మైనారిటీ వాటా కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ వాటాదారులకు ఒక్కో షేరుకు 4.27 డాలర్ల చొప్పున 22.6 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. వాటాదారులు ఇందుకు అంగీకరిస్తే యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ ఈక్విటీలో నాట్కో ఫార్మాకు 35.75 వాటా లభిస్తుంది. నాట్కో ఫార్మాకు ఇప్పటికే ఈ కంపెనీ ఈక్విటీలో 0.8 శాతం వాటా ఉంది. అన్ని అనుమతులు లబిస్తే నాలుగు నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందని భావిస్తున్నారు.


దక్షిణాఫ్రికా మార్కెట్‌లోకి ఎంట్రీ: ఫార్మా మార్కెట్‌ పరంగా చూస్తే ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా అతి పెద్ద మార్కెట్‌. ఈ మార్కెట్‌లో యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ కంపెనీకి మంచి పట్టుంది. యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ ఈక్విటీలో 36 శాతం కొనుగోలు చేయడం ద్వారా దక్షిణాఫ్రికాతో పాటు మిగతా ఆఫ్రికా దేశాల్లోనూ పట్టు పెంచుకునే అవకాశం ఉంటుందని నాట్కో ఫార్మా సీఈఓ, వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ నన్నపనేని చెప్పారు. నాట్కో పార్మా వంటి దిగ్గజంతో జట్టు కట్టడం తమకూ మేలు చేస్తుందని భావిస్తున్నట్టు యాడ్‌కాక్‌ ఇన్‌గ్రామ్‌ సీఈఓ ఆండ్రూ హాల్‌ తెలిపారు. దీని వల్ల మరింత చౌకగా తమ ఔషధాలు అందించగలుగుతామన్నారు. పైగా నాట్కో కంపెనీ 36 శాతం వాటా కోసం ఆఫర్‌ చేస్తున్న ధర, మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా ఉన్నందున మైనారిటీ వాటాదారులకూ మేలు జరుగుతుందన్నారు.


బీమా సంస్థలకు అంతర్గత అంబుడ్స్‌మన్‌

  • ఐఆర్‌డీఏఐ ప్రతిపాదన

న్యూఢిల్లీ: రూ.50 లక్షల వరకు క్లెయిమ్‌లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు బీమా సంస్థలకు అంతర్గత అంబుడ్స్‌మన్‌ను నియమించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించింది. రీఇన్సూరెన్స్‌ సంస్థలు మినహాయించి, మూడేళ్లకు పైగా కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని బీమా కంపెనీలకు ఇది వర్తిస్తుందని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. బీమా సంస్థలు ఒకరికి పైగా అంతర్గత అంబుడ్స్‌మన్‌లను నియమించుకోవచ్చని కూడా తెలిపింది. తాజా ప్రతిపాదనలపై ఆగస్టు 17లోగా ప్రజాభిప్రాయాలను కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 04:14 AM