MSME Loans India: ఎంఎస్‌ఎంఈ రుణాలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:06 AM
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) రుణ వితరణ పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ సంస్థల రుణాలు రూ.46 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...
రూ.46 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) రుణ వితరణ పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ సంస్థల రుణాలు రూ.46 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. ఇదే కాలంలో క్రియాశీలంగా ఉన్న రుణ ఖాతాల సంఖ్య 11.8ు పెరిగి 7.3 కోట్లకు చేరింది. ఎంఎ్‌సఎంఈల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రుణ పథకాలతో పాటు, విధానపరమైన మద్దతు ఇందుకు కారణమని సీఆర్‌ఐఎఫ్ హైమార్క్-సిడ్బీ నివేదిక తెలిపింది. గత రెండేళ్లలో ఎంఎ్‌సఎంఈల రుణ చెల్లింపుల నాణ్యత కూడా మెరుగుపడింది. 2023 సెప్టెంబరు నాటికి గడువు ముగిసి 91 నుంచి 180 రోజులైనా చెల్లించని రుణ బకాయిలు 1.7ు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర నాటికి 1.4 శాతానికి దిగి వచ్చినట్టు నివేదిక తెలిపింది. మొత్తం ఎంఎ్‌సఎంఈల రుణాల్లో 80ు ఒకే వ్యక్తి యాజమాన్యంలోని కంపెనీలకు దక్కాయని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా చూసినా వీరి వాటా 90ు ఉంది. మొత్తం రుణాల్లో కొత్త ఎంఎ్‌సఎంఈల వాటా 23.3 శాతం ఉండగా 57% మూలధన రుణాలున్నాయి.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి