Moody's Upgrades Adani: అదానీ సంస్థల రేటింగ్స్‌ను మెరుగు పరిచిన మూడీస్
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:43 PM
రేటింగ్స్ సంస్థ మూడీస్ అదానీ సంస్థల రేటింగ్‌ను మెరుగుపరిచింది. పలు సంస్థల రేటింగ్‌ను ‘సుస్థిరత’కు పెంచింది. ఈ విషయంపై అదానీ గ్రూప్ సీఈఓ మాట్లాడుతూ సంస్థ మౌలిక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం అదానీ గ్రూపునకు చెందిన సంస్థల రేటింగ్స్‌ను మెరుగుపరిచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన ఏజీఈఎల్-ఆర్‌జీ1, ఏజీఈఎల్-ఆర్‌జీ2 సంస్థల రేటింగ్‌ను బీఏ1/నెగెటివ్ నుంచి బీఏ1/ స్టేబుల్‌కు పెంచింది. సంస్థల్లో పెట్టుబడులు ఏమేరకు సురక్షితమో సూచించేందుకు మూడీస్ ఈ రేటింగ్స్‌ను కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఏఈఎస్‌ఎల్-యూఎస్‌పీపీ ఆర్‌జీ1 సంస్థ రేటింగ్‌ను కూడా బీఏఏ3/నెగెటివ్ నుంచి బీఏఏ3/ స్టేబుల్‌కు పెంచింది (Moody's Upgrades Adani Companies Ratings).
అదానీ ఇంటర్నేషనల్ కంటెయినర్ టర్మినల్ ప్రవేట్ లిమిటెడ్ రేటింగ్ కూడా బీఏఏ3/ నెగెటివ్ నుంచి బీఏఏ3/స్టేబుల్‌కు పెరిగింది. అంతకుముందు ఇతర రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, ఎస్ అండ్ పీ, కేర్ ఎడ్జ్ గ్లోబల్ సంస్థలు కూడా అదానీ సంస్థల రేటింగ్‌ను మెరుగుపరిచాయి.
ఇక అదానీ పోర్టుఫోలియో ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో అద్భుత పనితీరును కనబరిచింది. సామర్థ్యాల విస్తరణ కోసం ఈ ఏడాది ప్రథమార్థంలో సంస్థ కేపెక్స్ ఖర్చు కింద రూ.67,870 కోట్లను వెచ్చించింది. మరోవైపు సంస్థ ఈబీఐటీడీఏ ఆదాయం కూడా ఇదే కాలంలో 47,375 కోట్లకు చేరింది. ఈ స్థాయిలో సంస్థ ఆదాయం రాబట్టడం ఇదే తొలిసారి.
తమ ముఖ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం రెండంకెల వృద్ధి సాధించిందని అదానీ గ్రూపు సీఎఫ్‌ఓ జుగేషిందర్ తెలిపారు. కేపెక్స్ ఖర్చు మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుందని అన్నారు. అప్పుల భారం మాత్రం అంచనాల కంటే తక్కువగా ఉందని వివరించారు. సామర్థ్యాల పెంపుపై ఇంతగా నిధులు ఖర్చు చేస్తున్నా అప్పుల భారం తక్కువగా ఉండటం విశేషమని అన్నారు. మరోవైపు, భారత్‌లో థర్మల్ విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. 2032 ఆర్థిక సంవత్సరాలి కల్లా 24 గీగావాట్‌ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే యోచనలో ఉంది.
ఇవీ చదవండి:
ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి