పెట్టుబడి మోసాలకు చెక్
ABN , Publish Date - May 08 , 2025 | 04:22 AM
ఫేస్‌బుక్ వేదికగా పెట్టుబడి మోసాలకు మాతృసంస్థ మెటా చెక్ పెట్టింది. భారత్, బ్రెజిల్ వంటి దేశాల ప్రజలకు వల వేస్తూ మోసగాళ్లు రూపొందించిన 23 వేల పేజీలను...
23 వేల ఫేస్‌బుక్ పేజీలు తొలగించిన మెటా
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వేదికగా పెట్టుబడి మోసాలకు మాతృసంస్థ మెటా చెక్ పెట్టింది. భారత్, బ్రెజిల్ వంటి దేశాల ప్రజలకు వల వేస్తూ మోసగాళ్లు రూపొందించిన 23 వేల పేజీలను మార్చి నెలలో ఫేస్‌బుక్ నుంచి తొలగించింది. ‘‘ఈ స్కామర్లు డీప్‌ఫేక్, ఇతర ఆధునిక టెక్నిక్‌లను ఉపయోగించి పర్సనల్ ఫైనాన్స్ క్రియేటర్లు, క్రికెట్ ఆటగాళ్లు, వ్యాపార ప్రముఖుల పేరిట మోసపూరితమైన ఇన్వె్‌స్టమెంట్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిస్తారు. అలా ప్రజలు వలలో పడి వారు చెప్పిన స్కామ్ గ్యాంబ్లింగ్ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తారు’’ అని మెటా తెలిపింది. ఆ రకంగా మనుగడలో లేని నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తారని పేర్కొంది.
Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు