Maruti Suzuki Victoris : మారుతి కొత్త కారు విక్టోరిస్
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:27 AM
దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ విభాగంలో బ్రెజ్జా, ఫ్రాంక్స్, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి మోడళ్లను...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ విభాగంలో బ్రెజ్జా, ఫ్రాంక్స్, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి మోడళ్లను విక్రయిస్తున్న కంపెనీ.. విక్టోరిస్ పేరుతో మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని బుధవారం ఆవిష్కరించింది. హ్యుండయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్, టాటా కర్వ్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వేగన్ టైగున్‌కు పోటీగా ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. 1.5 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో కూడిన ఈ కారును అరెనా షోరూమ్స్ ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఆరు వేరియంట్లు, పది రంగుల్లో లభించనున్న ఈ కారులో మారుతి పలు ఆధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.11,000తో బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన కంపెనీ.. కారు ధరను త్వరలోనే ప్రకటించనుంది. దీని ప్రారంభ ధర రూ.9.75 లక్షల స్థాయిలో ఉండవచ్చని అంచనా. భద్రతకు సంబంధించి ఈ కారుకు 5-స్టార్ భారత్ ఎన్‌క్యా్‌ప సేఫ్టీ రేటింగ్ లభించినట్లు సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి