Indian Stock Market: మార్కెట్లో నిస్తేజం
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:17 AM
ముందుకు నడిపించే ట్రిగ్గర్లేవీ లేకపోవడం, విదేశీ నిధుల తరలింపు ఈక్విటీ మార్కెట్లో నిస్తేజాన్ని నింపాయి. ఈ కారణంగా వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ నష్టాలతోనే ముగిసింది...
367 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్
ముంబై: ముందుకు నడిపించే ట్రిగ్గర్లేవీ లేకపోవడం, విదేశీ నిధుల తరలింపు ఈక్విటీ మార్కెట్లో నిస్తేజాన్ని నింపాయి. ఈ కారణంగా వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 367.25 పాయింట్ల నష్టంతో 85,041.45 వద్ద ముగియగా నిఫ్టీ 99.80 పాయింట్ల నష్టంతో 26,042.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 470.88 పాయింట్ల వరకు కూడా దిగజారి 84,937.82 పాయిం ట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
వేదాంతా షేరు దూకుడు: వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన వేదాంతా లిమిటెడ్ షేరు శుక్రవారం ఏడాది గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాదిలో ఈ షేరు ఇప్పటివరకు 35ు పెరిగింది. బీఎ్‌సఈలో 35.29ు లాభపడి ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.607.65ని తాకింది. వరుసగా 13 సెషన్లలో ఈ షేరు 17.44ు దూసుకుపోయింది.
క్యాస్ట్రాల్ ఓపెన్ ఆఫర్: ఇంధన దిగ్గజం బీపీ అనుబంధ క్యాస్ట్రాల్ ఇండియా యూనిట్ కొనుగోలు డీల్‌లో భాగంగా కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వె్‌స్టమెంట్ బోర్డు, అమెరికాకు చెందిన పీఈ సంస్థ స్టోన్‌పీక్ 26ు షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫ్ అందించనున్నాయి. బుధవారం నాటి క్యాస్ర్టాల్ షేరు ముగింపు ధర కన్నా 2.5ు ప్రీమియం ధరకు అంటే ఒక్కో షేరు రూ.194.04కి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించాయి. శుక్రవారం ఈ షేరు రూ.191.40 వద్ద ట్రేడవుతోంది.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి