Share News

Make in India: కంపెనీలకు మేకిన్‌ ఇండియా ఊతం

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:42 AM

దేశీయ పారిశ్రామిక రంగానికి భారత్‌లో త యారీ (మేకిన్‌ ఇండియా) బాగానే ఉపకరిస్తోంది. దీంతో 2035 నాటికి దేశీయ కంపెనీల స్థూల విలువ జోడింపు (జీవీఏ) 9.82 లక్షల కోట్ల డాలర్ల...

Make in India: కంపెనీలకు మేకిన్‌ ఇండియా ఊతం

  • 2035 నాటికి రూ.837 లక్షల కోట్ల జీవీఏ

  • పీడబ్ల్యూసీ ఇండియా

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక రంగానికి భారత్‌లో త యారీ (మేకిన్‌ ఇండియా) బాగానే ఉపకరిస్తోంది. దీంతో 2035 నాటికి దేశీయ కంపెనీల స్థూల విలువ జోడింపు (జీవీఏ) 9.82 లక్షల కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ..837.15 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్‌వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసి) ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ఇందులో తయారీ, పారిశ్రామిక రంగాలది అగ్రస్థానమని పేర్కొంది. 2023 నాటికి 94,500 కోట్ల డాలర్లు గా ఉన్న ఈ రెండు రంగాల జీవీఏ 2035 నాటికి 2.75 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘నావిగేటింగ్‌ ది వాల్యూ షిఫ్ట్‌’ పేరుతో పీడబ్ల్యూసి ఇండియా ఈ నివేదిక విడుదల చేసింది. వాతావరణ మార్పులు, సాంకేతిక అవాంతరాలు, మారుతున్న ప్రజల అభిరుచులతో సంప్రదాయ పరిశ్రమల సరిహద్దులు చెరిగిపోతూ అదనపు విలువ జోడింపు జరగనుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 03:43 AM