PSU Bank Mergers: బ్యాంకింగ్ బీమాలో పెను మార్పులు
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:23 AM
వచ్చే ఏడాది దేశీయ బీమా, బ్యాంకింగ్ రంగాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే సూ చనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సంఖ్య మరింత తగ్గవచ్చు. ఆర్థికంగా...
పీఎస్‌బీల్లో మరో విడత విలీనాలు !
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశీయ బీమా, బ్యాంకింగ్ రంగాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే సూ చనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సంఖ్య మరింత తగ్గవచ్చు. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న కొన్ని పీఎ్‌సబీలను, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న పీఎ్‌సబీల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రస్తుతం 12గా ఉన్న పీఎ్‌సబీల సంఖ్య నాలుగైదుకు కుంచించుకుపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఆర్‌బీఐతోను, బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో ప్రకటించారు. మన దేశం నుండి కూడా అంతర్జాతీయ స్థాయి బ్యాంకుల సృష్టే లక్ష్యంగా ఈ కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.
అటకెక్కిన ప్రైవేటీకరణ: నిజానికి ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితమే భావించింది. నీతి ఆయోగ్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఉద్యోగ సంఘాల వ్యతిరేకత, ప్రైవేటు రంగం నుంచి సరైన ఆసక్తి రాకపోవడంతో ఆ ప్రయత్నం ముం దుకు సాగలేదు. ఇప్పుడు ఈ రెండు బ్యాంకులను కూడా వేరే పీఎ్‌సబీల్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనికి ఉద్యోగ సంఘాల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
‘ప్రైవేట్’పై విదేశీ పట్టు: మరోవైపు భారత బ్యాంకింగ్ రంగంపై విదేశీ బ్యాంకులు పట్టుబిగిస్తున్నాయి. ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ప్రైవేటు బ్యాంకులను ఇందుకు లక్ష్యంగా ఎంచుకుంటున్నాయి. జపాన్ ఆర్థిక దిగ్గజం సుమిటోమో మిత్సుఇ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబీసీ) రూ.13,483 కోట్ల పెట్టుబడితో ఎస్ బ్యాంక్ ఈక్విటీలో 20ు వాటా ఇప్పటికే కొనుగోలు చేసింది. యూఏఈకి చెందిన ఎన్‌బీడీ బ్యాంక్ కూడా రూ.26,853 కోట్ల పెట్టుబడితో ఆర్‌బీఎల్ బ్యాంకు ఈక్విటీలో 60ు వాటా కొనుగోలు చేస్తోంది. ఐడీబీఐ బ్యాంకు కూడా ఇదే దారిలో నడవనున్నదంటున్నారు.
బీమాలో 100 శాతం ఎఫ్‌డీఐ: బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇటీవలే పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వచ్చే ఏడాది ఈ రంగంలోనూ కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఏడాది బ్యాంకింగ్, బీమా రంగాల్లో చోటు చేసుకునే మార్పులకు 2025లో పునాది పడింది.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి