Share News

Lot Mobiles Ongole: ఒంగోలులో లాట్‌ మొబైల్స్‌ రెండో స్టోర్‌

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:25 AM

మొబైల్‌ ఫోన్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో రెండో స్టోర్‌ను ప్రారంభించింది. బుధవారం నాడు ఈ షోరూమ్‌ను టాలీవుడ్‌ నటి పాయల్‌...

Lot Mobiles Ongole: ఒంగోలులో లాట్‌ మొబైల్స్‌ రెండో స్టోర్‌

హైదరాబాద్‌: మొబైల్‌ ఫోన్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో రెండో స్టోర్‌ను ప్రారంభించింది. బుధవారం నాడు ఈ షోరూమ్‌ను టాలీవుడ్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌, సంస్థ డైరెక్టర్లు యం.సుప్రజ, యం.అఖిల్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ.. షోరూమ్‌ ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న లక్కీ డ్రాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌, వాషింగ్‌ మెషిన్‌, రిఫ్రిజిరేటర్‌, ఏసీ, స్మార్ట్‌ టీవీ, స్మార్ట్‌ఫోన్‌ బహుమతులుగా అందించనుందన్నారు. మొబైల్స్‌ కొనుగోలుపై రూ.10,000 వరకు మొబైల్‌ ప్రొటెక్షన్‌తో పాటు 10 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌, రూ.6,999 విలువ గల స్మార్ట్‌ కాలింగ్‌ వాచీ లేదా రూ.1,999 విలువ గల ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు డైరెక్టర్‌ సుప్రజ వెల్లడించారు. ఒంగోలు ప్రజల కోసం ప్రత్యేకంగా జీరో డౌన్‌పేమెంట్‌ ఫైనాన్స్‌ పథకం, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి ఆఫర్లు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని లాట్‌ మొబైల్స్‌ డైరెక్టర్‌ అఖిల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 05:25 AM