బీఎస్‌ఈలో వేగా జువెలర్స్ లిస్టింగ్
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:16 AM
వేగా జువెలర్స్ లిమిటెడ్.. గురువారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ)లో లిస్టయింది. వేగా జువెలర్స్ ఎండీ నవీన్ కుమార్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్....
వేగా జువెలర్స్ లిమిటెడ్.. గురువారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ)లో లిస్టయింది. వేగా జువెలర్స్ ఎండీ నవీన్ కుమార్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా, చైర్మన్ రామ్ మోహన్ బండ్లమూడి, డైరెక్టర్ చంద్రకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఎస్‌ఈలో కంపెనీని లిస్ట్ చేయటం ద్వారా తమ 20 సంవత్సరాల కల నెరవేరిందని సంస్థ ఎండీ నవీన్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. వేగా జువెలర్స్.. 15,000కు పైగా ప్రత్యేకమైన డిజైన్లు, 425 మంది సిబ్బందితో పాటు 4 లక్షల మంది విశ్వసనీయమైన కస్టమర్లను కలిగిఉందన్నారు. ప్రస్తుతం వేగా జువెలర్స్.. విజయవాడ, హైదరాబాద్, కాకినాడల్లో షోరూమ్స్ నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News