Share News

ఎల్‌ఐసీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

ABN , Publish Date - May 25 , 2025 | 04:33 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలను విక్రయించడం ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఒక్క రోజులో...

ఎల్‌ఐసీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

ఒక్క రోజులో 5,88,107 పాలసీల విక్రయం

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలను విక్రయించడం ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఒక్క రోజులో ఇన్ని పాలసీలు అమ్మిన బీమా కంపెనీ ఇదే. ఈ జనవరి 20న సంస్థకు చెందిన 4,52,839 ఏజెంట్లు ఈ పాలసీలను విక్రయించినట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. ‘‘ఇది మా ఏజెంట్ల అవిశ్రాంత అంకితభావం, నైపుణ్యం, నైతికతకు బలమైన ధ్రువీకరణ. మా కస్టమర్లు, వారి కుటుంబాలకు బీమా ద్వారా ఆర్థిక రక్షణ కల్పించాలన్న మా లక్ష్యం పట్ల నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది’’ అని ఎల్‌ఐసీ పేర్కొంది. ‘మ్యాడ్‌ మిలియన్‌ డే’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగం గా ఈ జనవరి 20న ప్రతి ఏజెంట్‌ కనీసం ఒక పాలసీనైనా విక్రయించాలని ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి కోరారు. దాంతో ఏజెంట్లందరూ కలిసి రికార్డు స్థాయిలో పాలసీలను విక్రయించారు.

ఇవీ చదవండి:

జూన్ 2025లో బ్యాంకు సెలవులు..ఎప్పుడు, ఎక్కడ బంద్

నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 04:33 AM