LG Electronics IPO listing: ఎల్‌జీ బంపర్ లిస్టింగ్
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:18 AM
ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ ఇండియా స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌కు భారీ స్పందన లభించింది. గత వారం ఐపీఓ ముగించుకున్న ఈ ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం..
తొలిరోజే ఇన్వెస్టర్లకు 50% లాభం
రూ.1.14 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ ఇండియా స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌కు భారీ స్పందన లభించింది. గత వారం ఐపీఓ ముగించుకున్న ఈ ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం.. తన షేర్లను మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.1,140తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు ఏకంగా 50.43 శాతం లాభంతో రూ.1,715 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. ఒక దశలో 52.31 శాతం వృద్ధితో రూ.1,736.40 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి షేరు ధర 48.23 శాతం లాభంతో రూ.1,689.90 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,14,671.81 కోట్లకు చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News