Share News

Late Filing of Income Tax: ఆలస్యంగానూ రిటర్నుల ఫైలింగ్‌

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:09 AM

ఈ నెల 16తో ఐటీ రిటర్న్‌ల గడువు ముగిసింది. డెడ్‌లైన్‌ను ఒక రోజు పొడిగించినా కొంతమంది ఇంకా తమ రిటర్న్‌ ఫైల్‌ చేయలేదు. అయితే వీరు లేటు ఫీజుతో తమ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ ఏడాది డిసెంబరు...

Late Filing of Income Tax: ఆలస్యంగానూ  రిటర్నుల  ఫైలింగ్‌

లేటు ఫీజుతో సాధ్యమే

ఈ నెల 16తో ఐటీ రిటర్న్‌ల గడువు ముగిసింది. డెడ్‌లైన్‌ను ఒక రోజు పొడిగించినా కొంతమంది ఇంకా తమ రిటర్న్‌ ఫైల్‌ చేయలేదు. అయితే వీరు లేటు ఫీజుతో తమ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు గడువు ఉంది.

పెనాల్టీ ఎంత?

  • వార్షికాదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000

  • వార్షికాదాయం రూ.5 లక్షలకు మించితే రూ.5,000

ఎదురయ్యే పరిణామాలు

వడ్డీ భారం..

నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయకుండా, ఆలస్యంగా చేస్తే, చెల్లించాల్సిన పన్ను బకాయిలపై వడ్డీ పడుతుంది.

క్యారీ ఫార్వర్ద్‌ ప్రయో జనాలు కోల్పోవడం..

రిటర్న్‌ ఆలస్యంగా ఫైల్‌ చేసినా పూరించని తరుగుదల, ఇంటి అమ్మకాలపై వచ్చే నష్టాలకు మాత్రమే క్యారీ ఫార్వర్డ్‌ ప్రయోజనం లభిస్తుంది. మిగతా నష్టాలకు ఆశలు వదులుకోవాల్సిందే

రిఫండ్స్‌ ఆలస్యం..

ఇప్పటికే రిటర్న్‌ ఫైల్‌ చేసి రెండు మూడు నెలలు గడిచినా కొందరికి రిఫండ్స్‌ అందలేదు. గడువు ముగిశాక ఫైల్‌ చేసే రిటర్న్‌ల రిఫండ్స్‌ మరింత ఆలస్యం అవుతాయి.

మరింత స్క్రూటినీ..

ఆలస్యంగా ఫైల్‌ చేసే ఐటీ రిటర్న్‌లను ఐటీ శాఖ మరింత కూలంకషంగా స్క్రూటినీ చేసే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 05:09 AM