Greenfield Radial Road: ఎల్ అండ్ టీకి హైదరాబాద్ రేడియల్ రోడ్ ప్రాజెక్ట్
ABN , Publish Date - Dec 30 , 2025 | 07:05 AM
కొత్తగా నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ప్రాజెక్టు ను తమ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొత్తగా నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ప్రాజెక్టు ను తమ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగం దక్కించుకుందని ఎల్ అండ్ టీ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో ఈ రెండో దశ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. రూ.1,000 నుంచి రూ.2,500 కోట్ల మధ్యన విలువ గల ప్రాజెక్టులను ‘‘విశిష్ట’’ ప్రాజెక్టులుగా ఎల్ అండ్ టీ వర్గీకరిస్తుంది. 3+3 లేన్లుగా నిర్మించే ఈ యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్ నిడివి 22.3 కిలోమీటర్లు. ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)ను 340 కిలోమీటర్ల నిడివి గల రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)తో అనుసంధానం చేయడం వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీని ఇది పెంచుతుందని బీఎ్‌సఈకి పంపిన ఒక ప్రకటనలో ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3.6 కిలోమీటర్ల వయాడక్ట్, చిన్న వంతెనలు, అండర్ పాస్‌లు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ వెల్లడించింది.
Also Read:
Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?
Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..
Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు