Best Airlines in the World: ప్రపంచంలో బెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇదే!
ABN , Publish Date - Feb 10 , 2025 | 10:27 PM
ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ సంస్థగా కొరియన్ ఎయిర్ ఎంపికైంది. ప్రయాణికుల సౌకర్యానికే పెద్ద పీట వెస్తు్న్నందుకు ఎయిర్‌రేటింగ్స్ డాట్ కామ్ సంస్థ పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఎక్కువ దూరాలు విమానంలో ప్రయాణం చేయాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు. అన్ని గంటలు ఒకే చోట కదలకుండా కూర్చోవడం కష్టం అనేది అనుభవజ్ఞులు చెప్పే మాట. దీనికి తోడు సేవా లోపాలు కూడా విమాన ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి. ఫలితంగా నిత్యం నెట్టింట విమాన ప్రయాణికులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అయితే, ప్రయాణికుల సౌకర్యానికే పెద్ద పీట వేసిన ఓ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం ప్రపంచంలో నెం.1గా నిలిచింది (Business News).
సాధారణంగా సౌకర్యవంతమైన విమాన ప్రయాణమంటే అనేక మందికి ఖతర్ ఎయిర్ వేస్ గుర్తొస్తుంది. అయితే, ఈసారి ఖతర్ ఎయిర్‌వేస్‌ను తలదన్ని కోరియన్ ఎయిర్ అనే ఎయిర్‌లైన్స్ నెం.1గా నిలిచింది. లాభాల కంటే ప్రయాణికుల సౌకర్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన కోరియన్ ఎయిర్‌ను ఈసారి తాము నెం.1గా ఎంపిక చేసినట్టు ఎయిర్‌లైన్ రేటింగ్స్.కామ్ సంస్థ అధికారి తెలిపారు.
IT Sector Salary Hike: ఐటీ రంగంలో ఈ సారి శాలరీ పెంపు ఎంత?
‘‘చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ బోయింగ్ విమానాల్లోని ఒక వరుసలో పది సీట్లు ఉండేలా మార్పులు చేశాయి. ఇక ఎకనామీ సీట్ల మధ్య ఎడాన్ని 32 అంగుళాల నుంచి 31 అంగుళాలకు కుదించాయి. అయితే, కొరియన్ ఎయిర్ మాత్రం ఇవేమీ చేయలేదు. ప్రయాణికుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే దీన్ని మేము నెం.1గా ఎంపిక చేశాము’’ అని సంస్థ సీఈఓ పేర్కొన్నారు.
ఎయిర్‌లైన్స్ రేటింగ్ ప్రకారం టాప్ 10 ఎయిర్‌లైన్స్ సంస్థలు ఏవంటే..
కొరియన్ ఎయిర్
ఖతర్
ఎయిర్ న్యూజిలాండ్
కాథే పెసిఫిక్
సింగపూర్ ఎయిర్‌లైన్స్
ఎమిరేట్స్
జపాన్ ఎయిర్‌లైన్స్
కాంటాస్
ఎథిహాద్
టర్కీష్ ఎయిర్‌లైన్స్
Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. రూపాయి మరింత పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
చివరన ఉన్న 10 ఎయిర్‌లైన్స్..
సౌత్‌వెస్ట్
స్కై ఎయిర్‌లైన్
ఫ్లైనాస్
టీయూఐ
నార్వేజియన్
ఇండి గో
ఎయిర్ అరేబియా
వొలారిస్
జెట్ 2
విజ్
వ్యూయెలింగ్
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..