IT Sector Salary Hike: ఐటీ రంగంలో ఈ సారి శాలరీ పెంపు ఎంత?
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:45 PM
ఈసారి ఐటీ రంగంలో సగటు శాలరీ పెంపు 3 నుంచి 8 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల శాలరీ పెంపు విషయంలో ఐటీ కంపెనీలు ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థల టర్నోవర్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నా సగటు శాలరీ పెంపు మాత్రం 3 నుంచి 8 శాతం వరకూ మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, కంపెనీల పనితీరు, ఎందరు ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు తదితరాల ఆధారంగా సంస్థలు ఈమారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయట (IT Sector Salary Hike).
ఇండస్ట్రీ టాప్ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటివన్నీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మంచి టర్నోవర్ సాధించాయి. అయితే, గ్లోబల్ పరిస్థితులకు అనుగూణంగా ఐటీ రంగంలో చోటుచేసుకుంటున్న సర్దుబాట్లు శాలరీ పెంపుపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పర్కొన్నారు. ఎంప్లాయీ ఆట్రిషన్ రేటు ఈసారి 12 - 13 శాతం వరకూ ఉండొచ్చని అనేక సంస్థలు అంచనాకు వచ్చాయి. అయినా కూడా శాలరీ పెంపు విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటిస్తున్నాయట. మంచి పనితీరు కనబరిచే వారిపైనే ఈసారి దృష్టిపెడుతున్నట్టు తెలుస్తోంది.
Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. రూపాయి మరింత పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
జాతీయ మీడియా కథనాల ప్రకారం, టీసీఎస్ ఈసారి సగటున 7 నుంచి 8 శాతం శాలరీ హైక్ ప్రకటించే అవకాశం ఉందట. అద్భుత పనితీరు కనబరిచిన వారికి మాత్రమే రెండంకెల సంఖ్యలో జీతాల పెంపు ఉంటుందట. ఇన్ఫోసిస్‌లో రెండు విడతల్లో శాలరీ పెంపు ఉంటుందట. జూనియర్ల పనితీరుపై జనవరిలో సమీక్ష తరువాత ఏప్రిల్‌లో సగటున 6 నుంచి 8 శాతం మేర జీతాల పెంపు ప్రకటించొచ్చు. విప్రో, హెచ్‌సీఎల్ సంస్థల్లో ఆట్రిషన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగులను నిలుపుకునేందుకు ఉపకరించే శాలరీ పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయట. ఫిక్స్‌డ్ మొత్తంలో పెంపునకు బదులు వేరియబ్ పే అడ్జస్ట్‌మంట్స్ వైపు మొగ్గుచూపుతున్నాయట.
Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే..
ఇక కొన్ని కంపెనీలు శాలరీల పెంపును ఏప్రిల్, జూన్ బదులు సెప్టెంబర్ -అక్టోబర్ నెలల్లో చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఖర్చుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు శాలరీ పెంపును ఆయా సంస్థలు వాయిదా వేశాయట. స్థూలంగా చెప్పాలంటే.. ఆర్థిక ఒత్తిడులు, నియామకాల్లో సమస్యల నేపథ్యంలో శాలరీ పెంపు ఓ మోస్తరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులందరికీ గంపగుత్తగా కాకుండా టాప్ పర్‌ఫార్మర్లవైపే సంస్థలు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..