Share News

Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. రూపాయి మరింత పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ABN , Publish Date - Feb 10 , 2025 | 10:12 AM

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు, స్టీల్, అల్యూమినియంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించడంతో దేశీయ సూచీలు సోమవారం నష్టాలతో మొదలయ్యాయి.

Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. రూపాయి మరింత పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Market

డాలరుతో పోల్చుకుంటే రూపాయి జీవన కాల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు, స్టీల్, అల్యూమినియంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించడంతో దేశీయ సూచీలు సోమవారం నష్టాలతో మొదలయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 45 పైసలు క్షీణించి 87.88కి పడిపోయింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Business News)


గత శుక్రవారం ముగింపు (77, 860)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్తోకి జారుకుంది. ఒక దశలో 450 పాయింట్లకు పైగా కోల్పోయి 77, 396కు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో 415 పాయింట్ల నష్టంతో 77, 444 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 134 పాయింట్ల నష్టంతో 23, 425 వద్ద కొనసాగుతోంది. మిగిలిన ఆసియా మార్కెట్లు కూడా నేడు మిశ్రమంగానే కదలాడుతున్నాయి.


సెన్సెక్స్‌లో బ్రిటానియా, కమిన్స్, ఎన్‌సీసీ, పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆల్కెమ్ ల్యాబ్, వేదాంత, సెయిల్, ఆయిల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 676 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్ల నష్టంతో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 10:12 AM