Share News

KLM Royal Dutch Airlines: హైదరాబాద్‌-ఆమ్‌స్టర్‌డామ్‌ మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసు

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:24 AM

నెదర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ మన దేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌ నుంచి నెదర్లాండ్స్‌ రాజధాని...

KLM Royal Dutch Airlines: హైదరాబాద్‌-ఆమ్‌స్టర్‌డామ్‌ మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసు

కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెదర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ మన దేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌ నుంచి నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కు డైరెక్ట్‌ విమాన సర్వీసులు ప్రారంభించింది. వారానికి మూడు రోజలు ఈ సర్వీసులు నడుస్తాయని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మార్టెన్‌ స్టీనెన్‌ చెప్పారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై తర్వాత భారత్‌లో హైదరాబాద్‌ తమకు నాలుగో ప్రవేశ ద్వారమని తెలిపారు. ప్రస్తుతం ఈ నాలుగు నగరాల నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌ వారానికి 24 విమాన సర్వీసులు నడుపుతోంది. వింటర్‌ సీజన్‌లో ఈ సర్వీసులను 27కు పెంచనున్నట్టు మార్టెన్‌ స్టీనెన్‌ చెప్పారు. ఫార్మా, ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్‌ నుంచి సరుకు రవాణాకు అద్భుత అవకాశం ఉందన్నారు. బోయింగ్‌ 777-200ఈఆర్‌ విమానాలతో ప్రారంభించిన హైదరాబాద్‌-అమెస్టర్‌డ్యామ్‌ విమాన సర్వీసులో వివిధ తరగతుల్లో 288 మంది ప్రయాణించ వచ్చని కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 05:24 AM