Share News

KIMS Hospitals to Boost: కలిసిరానున్న విస్తరణ

ABN , Publish Date - Sep 02 , 2025 | 05:25 AM

మహారాష్ట్రలోని థానే, బెంగళూరుల్లో ఏర్పాటు చేసిన కొత్త హాస్పిటల్స్‌తో కిమ్స్‌ హాస్పిటల్‌ ఆదాయం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఒక్కో పడక (బెడ్‌)పై రూ.45,000గా ఉన్న సగటు ఆదాయం (ఏఆర్‌పీఓబీ) త్వరలోనే...

KIMS Hospitals to Boost: కలిసిరానున్న విస్తరణ

పెరగనున్న ఆదాయం : కిమ్స్‌ హాస్పిటల్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహారాష్ట్రలోని థానే, బెంగళూరుల్లో ఏర్పాటు చేసిన కొత్త హాస్పిటల్స్‌తో కిమ్స్‌ హాస్పిటల్‌ ఆదాయం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఒక్కో పడక (బెడ్‌)పై రూ.45,000గా ఉన్న సగటు ఆదాయం (ఏఆర్‌పీఓబీ) త్వరలోనే రూ.55,000కు చేరే అవకాశం ఉందని కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీఎ్‌ఫఓ సచిన్‌ అశోక్‌ సాల్వీ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. థానేలో ఈ ఏడాది మే నెలలో ప్రారంభించిన కిమ్స్‌ హాస్పిటల్‌ ద్వారా ఒక్కో బెడ్‌పై సగటున రూ.55,000 నుంచి రూ.60,000 వరకు ఆదాయం లభిస్తోంది. గత నెల బెంగళూరులో ప్రారంభమైన హాస్పిటల్‌ నుంచి ఒక్కో పడకపై సగటున రూ.75,000 వరకు ఆదాయం లభిస్తోందని సాల్వీ తెలిపారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒక్కో బెడ్‌పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం ప్రస్తుత రూ.45,000 నుంచి రూ.55,000కు చేరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా ప్రారంభించిన ఈ రెండు హాస్పిటల్స్‌ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ స్థూల లాభం రూ.60 కోట్ల నుంచి రూ.75 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని సాల్వీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 05:25 AM