KIMS Hospitals Opens: బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్స్
ABN , Publish Date - Sep 18 , 2025 | 03:17 AM
బెంగళూరులో తొలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బెంగళూరులో తొలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) ప్రకటించింది. 450 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్‌లో సమగ్ర వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఈ హాస్పిటల్‌లో 35 మెడికల్, సర్జికల్ స్పెషాలిటీస్, 120కి పైగా అడ్వాన్స్‌డ్ బెడ్స్‌తో పాటు అవు ట్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా 100కు పైగా రూమ్స్ అందుబాటులో ఉన్నాయని కిమ్స్ వెల్లడించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో బెంగళూరులో తొలి హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ భాస్కర్ రావు తెలిపారు. కాగా త్వరలోనే బెంగళూరులోని ఎలకా్ట్రనిక్ సిటీలో రెండో యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు భాస్కర్ రావు చెప్పారు.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News