Joyalukkas Kukatpally Showroom: కూకట్‌పల్లిలో జోయాలుక్కాస్ రెండో షోరూమ్
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:51 AM
ప్రముఖ జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కూకట్‌పల్లిలో రెండో షోరూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 12న...
12న ప్రారంభం
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కూకట్‌పల్లిలో రెండో షోరూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 12న ప్రారంభించనున్న ఈ షోరూమ్‌ను ప్రపంచ స్థాయి జువెలరీ షాపింగ్ అనుభూతిని అందించటంతో పాటు ప్రీమియం సదుపాయాలతో తీర్చిదిద్దినట్లు జోయాలుక్కాస్ వెల్లడించింది. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై వినియోగదారులకు ఉచిత బహుమతిని అందించనున్నట్లు తెలిపింది. కూకట్‌పల్లిలో రెండో షోరూమ్‌ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోయ్ అలుక్కాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి