ITR Late Filing: సెప్టెంబర్ 16న చేయకున్నా నో ప్రాబ్లం.. ఇప్పటికైనా ITR ఫైల్ చేయవచ్చు..
ABN , Publish Date - Sep 18 , 2025 | 07:46 AM
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు సెప్టెంబర్ 16తో ముగిసిపోయిందని చాలామంది భావిస్తారు. కానీ ట్యాక్స్‌పేయర్లు తమ ITRలను ఇంకా ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఎప్పటి వరకు ఉంది, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సీజన్ ముగిసినట్టేనా, అంటే లేదు. సెప్టెంబర్ 16 తర్వాత కూడా లక్షలాది మంది ట్యాక్స్‌పేయర్లకు ఆలస్యంగా దాఖలు చేసే అవకాశం (ITR Late Filing) ఉంది. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2025-26, ఆర్థిక సంవత్సరం (FY) 2024-25 ఆధారంగా ITR ఫైలింగ్ డెడ్‌లైన్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జులై 31 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉచితంగా ఐటీఆర్ ఫైల్ చేసే ఛాన్స్ ఇచ్చింది.
ఈ డెడ్‌లైన్ మిస్ అయినవారు ఇప్పుడు బిలేటెడ్ రిటర్న్ ద్వారా డిసెంబర్ 31, 2025 వరకు ఫైల్ చేయవచ్చు. కానీ, ఆలస్యంగా చేస్తే ఫైన్‌లు, వడ్డీలు విధించబడతాయి. ఈ విషయంలో పన్ను చెల్లింపు దారులు ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా ఫైల్ చేయాలి. లేకపోతే రిఫండ్‌లు ఆలస్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో మార్పులు
ఈ సంవత్సరం ITR ఫైలింగ్ ప్రాసెస్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట్లో జులై 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను, CBDT మే నెలలో సెప్టెంబర్ 15 వరకు పెంచింది. తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులు, పోర్టల్ టెక్నికల్ ఇష్యూల కారణంగా మరో పొడిగింపు ఇచ్చింది.
నాన్-ఆడిట్ ట్యాక్స్‌పేయర్లు (అంటే, వ్యాపారాలు కాకుండా సాధారణ విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు) కోసం ఈ డెడ్‌లైన్ వర్తిస్తుంది. ఆడిట్ అవసరమైతే అక్టోబర్ 31 వరకు సమయం ఉంది. సెప్టెంబర్ 16 తర్వాత ఫైల్ చేయడం అంటే, అది 'బిలేటెడ్'గా పరిగణించబడుతుంది. ఇది సెక్షన్ 139(4) ప్రకారం డిసెంబర్ 31 వరకు చేయవచ్చు.
ఆలస్య ఫైలింగ్‌కు ఫైన్‌లు ఎలా
సెక్షన్ 234F ప్రకారం లేట్ ఫీ విధించబడుతుంది. మీ మొత్తం ఆదాయం రూ.5 లక్షలు మించితే రూ.5,000 ఫైన్. ఆదాయం రూ.5 లక్షలకు తక్కువ ఉంటే కేవలం రూ.1,000 మాత్రమే. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వార్షిక ఆదాయం రూ.10 లక్షలు ఉంటే, ఆలస్యంగా ఫైల్ చేస్తే రూ.5,000 తప్పకుండా చెల్లించాలి.
ఇంకా, సెక్షన్ 234A ప్రకారం, చెల్లించని ట్యాక్స్ మొత్తంపై నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. ముందస్తు ట్యాక్స్ (అడ్వాన్స్ ట్యాక్స్) చెల్లించకపోతే ఇది మరింత పెరుగుతుంది. ఆలస్యం వల్ల రిఫండ్‌లు ఆలస్యమవుతాయి. దీంతో HRA, హోమ్ లోన్ డెడక్షన్లు లాంటి ప్రయోజనాలు కోల్పోతారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి