Insurance Sugam Portal: అందుబాటులోకి బీమా సుగమ్
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:55 AM
బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (బీఎ్‌సఐఎఫ్) వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి...
న్యూఢిల్లీ: బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (బీఎ్‌సఐఎఫ్) వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ప్రధాన కార్యాలయంలో మండలి బీమా కంపెనీల సీఈఓలతో కలిసి ఐఆర్ డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్ ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. 2047 నాటికి ప్రధాని మోదీ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’లో అందరికీ బీమా లక్ష్య సాధనకు ఈ వెబ్‌సైట్ తోడ్పడుతుందని సేథ్ తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలతో పాటు జనరల్ బీమా పాలసీలను ఎంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి