Share News

Injeti Srinivas NSE Chairman: ఎన్ఎస్ఈ చైర్మన్‌గా ఇంజేటి శ్రీనివాస్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:56 AM

ఒడిశా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎ్‌ససీఏ) మాజీ వ్యవస్థాపక చైర్మన్‌ ఇంజేటి శ్రీనివాస్‌.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) చైర్మన్‌గా నియమితులయ్యారు...

Injeti Srinivas NSE Chairman: ఎన్ఎస్ఈ చైర్మన్‌గా ఇంజేటి శ్రీనివాస్‌

న్యూఢిల్లీ: ఒడిశా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎ్‌ససీఏ) మాజీ వ్యవస్థాపక చైర్మన్‌ ఇంజేటి శ్రీనివాస్‌.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) చైర్మన్‌గా నియమితులయ్యారు. మంగళవారం నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఎన్‌ఎస్‌ఈకి సారథి లేరు. తొలి పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీఓ) ఎక్స్ఛేంజీ సిద్ధం అవుతున్న సమయంలో తెలుగు మూలాలున్న శ్రీనివాస్‌ నియామకం జరిగింది. ఆయన ఇటీవల ఎన్‌ఎ్‌సఈలో పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ డైరెక్టర్‌గా చేరారు. గతంలో ఆయన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. కార్పొరేట్‌, ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, కార్పొరేట్‌, దివాలా చట్టం, కాంపిటీషన్‌ చట్టం, చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ వంటి భిన్న రంగాల్లో ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉంది. ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి బీఏ (హానర్స్‌) పూర్తి చేసిన శ్రీనివాస్‌ 1983లో ఒడిశా కేడర్‌ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 01:56 AM