Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!
ABN , Publish Date - Feb 07 , 2025 | 07:59 PM
ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో 700 మంది ట్రెయినీ ఉద్యోగులను బలవంతంగా తొలగించారంటూ జాతీయ మీడియా కథనాలపై సంస్థ స్పందించింది. అంతర్గత పరీక్ష పాసయ్యేందుకు వారికి అప్పటికే మూడు సార్లు అవకాశం ఇచ్చామని పేర్కొంది. ఇది రెండు దశాబ్దాలుగా అనుసిరిస్తు్న్న పద్ధతేనని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో 700 మంది ఉద్యోగుల్ని బలవంతంగా తొలగించారంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై సంస్థ తాజాగా స్పందించింది. తాము నిర్వహించే పనితీరు ముదింపులో ఉత్తీర్ణులయ్యే ఫ్రెషర్లనే సంస్థలో కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తాము అనుసరించే పనితీరు ముదింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని, సంస్థలో రెండు దశాబ్దాలుగా అమల్లో ఉందని పేర్కొంది. మైసూరు క్యాంపస్‌లో ఫ్రెషర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ఆ తరువాత వారి పనితీరుపై జరిగే అంతర్గత ముదింపులో ఉత్తీర్ణులైతేనే సంస్థలో కొనసాగుతారని పేర్కొంది (Infosys).
Ratan Tata Will: రతన్ టాటా వీలునామాలో మిస్టరీ వ్యక్తి! ఆయనకు ఎంత ఆస్తి వచ్చిందంటే..
‘‘ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో మేము కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తాము. ఫ్రెషర్ల విస్తృత ప్రాథమిక శిక్షణ అనంతరం వార పనితీరుపై అంతర్గత ముదింపు జరుగుతుంది. దీన్ని పాసయ్యేందుకు ప్రతి ఫ్రెషర్‌కు మూడు అవకాశాలు ఉంటాయి. ఆ తరువాత కూడా ఉత్తీర్ణత సాధించలేని వారు సంస్థలో కొనసాగజాలరు. ఈ విషయాన్ని కాంట్రాక్ట్‌లో కూడా పేర్కొన్నాము. మా క్లైంట్స్ కోసం నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉండేలా చేయడమే ఈ ప్రక్రియ లక్ష్యం’’ అని ఇన్ఫోసిస్ వివరణ ఇచ్చింది.
RBI Repo Rate: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉద్యోగులను బృందాలుగా పిలిపించి తొలగింపు విషయాన్ని పేర్కొన్నారు. ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేసేందుకు బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారని నేసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (ఎన్ఐటీఈఎస్) అనే సంస్థ జాతీయ మీడియాకు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో సంస్థను వీడుతున్నట్టు లేఖలపై సంతకాలు చేయాలని వారిని బలవంతం చేసినట్టు పేర్కొంది. సెవరెన్స్ ప్యాకేజీలేమీ లేకుండా సాయంత్రానికల్లా క్యాంపస్ వీడాలని పేర్కొన్నట్టు ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. ఎన్ఐటీఈఎస్ సంస్థ ఇన్ఫోసిస్‌పై కార్మిక శాఖలో ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు సమాచారం.