Share News

Indosol Solar IPO: వచ్చే ఏడాది ఇండోసోల్‌ సోలార్‌ ఐపీఓ

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:26 AM

స్థానిక శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఐపీఓ ఉంటుందని శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ సీఎండీ...

Indosol Solar IPO: వచ్చే ఏడాది ఇండోసోల్‌ సోలార్‌ ఐపీఓ

హైదరాబాద్‌ : స్థానిక శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఐపీఓ ఉంటుందని శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ సీఎండీ ఎన్‌ విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇండోసోల్‌ సోలార్‌ ఐపీఓ కుదరకపోతే శిరిడీ సాయి ఎలక్ట్రికల్‌ ఐపీఓ ఉంటుందన్నారు. సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ (పీవీ) మాడ్యూళ్ల తయారీ కోసం ఇండోసోల్‌ సోలార్‌ నెల్లూరు జిల్లాలోని కరేడు వద్ద ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంటులో వచ్చే ఏడాది చివరి కల్లా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన సోలార్‌ పీవీల ఉత్పత్తి ప్రారంభమవుతుందని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. ఈ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ పథకం కింద రూ.5,175 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నట్టు చెప్పారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.69,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 02:26 AM