Indias Gold Holdings Surpass GDP: పసిడి.. జీడీపీని మించి
ABN , Publish Date - Dec 30 , 2025 | 07:18 AM
భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువే. గడిచిన రెండేళ్లలో పసిడి ధర వేగం గా పెరుగుతూ వచ్చినప్పటికీ మనోళ్ల కొనుగోళ్లు మాత్రం తగ్గింది లేదు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లోనైతే ఈ లోహానికి...
భారతీయుల వద్దనున్న బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు..
మన జీడీపీ 4.1 లక్షల కోట్ల డాలర్లే..
భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువే. గడిచిన రెండేళ్లలో పసిడి ధర వేగం గా పెరుగుతూ వచ్చినప్పటికీ మనోళ్ల కొనుగోళ్లు మాత్రం తగ్గింది లేదు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లోనైతే ఈ లోహానికి గిరాకీ మరీ అధికం. అందుకే, మన వద్ద ఏ దేశవాసుల వద్ద లేనంత స్థాయిలో బంగారం నిల్వలున్నాయి. భారత కుటుంబాలు ఏకంగా 34,600 టన్నుల పసిడి నిల్వలను కలిగి ఉన్నాయని అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ గత అక్టోబరులో విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. ఈ ఏడాదిలో బంగారం రేటు భారీగా ఎగబాకడంతో మనోళ్ల వద్దనున్న నిల్వల విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 4,550 డాలర్లకు చేరుకుంది. ఈ లెక్కన, భారత కుటుంబాల మొత్తం బంగారం నిల్వల విలువ 5 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఇది మన దేశ జీడీపీ 4.1 లక్షల కోట్ల డాలర్ల కంటే అధికం.
నం.2 పసిడి వార్షిక వినియోగంలో చైనా తర్వాత స్థానం భారత్‌దే
26 శాతం
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ప్రపంచ పసిడి గిరాకీలో భారత్ వాటా ఇది. 28 శాతం వాటాతో చైనా అగ్రస్థానంలో ఉంది.
32 శాతం
ఈ జూన్ నాటికి పసిడి గిరాకీలో నాణేలు, కడ్డీల వాటా ఇది. ఐదేళ్ల క్రితం (2020 జూన్) ఈ వాటా దాదాపు 24 శాతం. అంటే, ఐదేళ్లలో 8 శాతం పెరిగింది. దేశంలో పసిడిలో పెట్టుబడులపై ఆసక్తి గణనీయంగా పెరిగిందనడానికిది నిదర్శనం.
880 టన్నులు
ఆర్‌బీఐ వద్దనున్న బంగారం నిల్వలు. విదేశీ మారక (ఫారెక్స్) నిల్వల్లో పసిడి వాటా 14 శాతంగా ఉంది.
75-80%
దేశీయ కుటుంబాల వద్దనున్న బంగారం నిల్వల్లో ఆభరణాల వాటా.
వార్షిక పసిడి గిరాకీలోనూ మూడింట రెండో వంతు వాటా ఆభరణాలదే.
Also Read:
Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?
Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..
Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు