Share News

Indias Electronics Exports: పెట్రో ఎగుమతులను మించనున్న ఎలక్ట్రానిక్స్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 02:24 AM

భారత్‌ నుంచి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, ఉపకరణాల ఎగుమతులు శరవేగంతో పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో దేశం నుంచి వీటి ఎగుమతులు 63 శాతం పెరిగి 2,350 కోట్ల డాలర్ల నుంచి 3,850 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రస్తుత...

Indias Electronics Exports: పెట్రో ఎగుమతులను మించనున్న ఎలక్ట్రానిక్స్‌

ఐఫోన్ల ఎగుమతులతో మరింత దన్ను

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, ఉపకరణాల ఎగుమతులు శరవేగంతో పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో దేశం నుంచి వీటి ఎగుమతులు 63 శాతం పెరిగి 2,350 కోట్ల డాలర్ల నుంచి 3,850 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ మన దేశం నుంచి 2,220 కోట్ల డాలర్ల విలువైన ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, ఉపకరణాలు ఎగుమతయ్యాయి. ఇందులో సగానికిపైగా వాటా యాపిల్‌ ఐఫోన్లదే ఉండడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎలకా్ట్రనిక్‌ వస్తువుల ఎగుమతి 42 శాతం పెరిగింది. ఇదే వృద్ధి రేటు కొనసాగితే, 2022-23తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి వీటి ఎగుమతులు రెట్టింపై పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను మించి పోతాయని అంచనా.

ఎగుమతుల లక్ష్యం సాధిస్తాం: అమెజాన్‌ ఇండియా

భారత్‌ నుంచి 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 8,000 కోట్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధిస్తామని అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 2,000 కోట్ల డాలర్ల ఎగుమతులు పూర్తి చేసినట్టు అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ఇండియా ప్రధాన అధికారి శ్రీనిధి కాల్వపూడి చెప్పారు. గత పదేళ్లలో తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా దేశీయ ఎగుమతిదారులు అంతర్జాతీయ కస్టమర్లకు 75 కోట్లకుపైగా దేశీయ ఉత్పత్తులను విక్రయించినట్టు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 02:24 AM