Share News

Indias Data Centers Grow: జోరుగా డేటా సెంటర్లు

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:03 AM

దేశంలో డేటా కేంద్రాల (డీసీ) ఏర్పాటు జోరందుకుంది. ఇప్పటికే భారత్‌లో 1,400 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న డీసీలు ఏర్పాటయ్యాయి. వీటి సామర్ధ్యం 2027 నాటికి రెట్టింపై, 2030 నాటికి ఐదు రెట్లు పెరుగుతుందని మక్వేరీ ఈక్విటీ రీసెర్చ్‌...

Indias Data Centers Grow: జోరుగా డేటా సెంటర్లు

2030 నాటికి దేశంలో ఐదింతలు పెరుగుతాయ్‌

  • 8 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు

  • 8 మక్వేరీ ఈక్విటీ రీసెర్చ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో డేటా కేంద్రాల (డీసీ) ఏర్పాటు జోరందుకుంది. ఇప్పటికే భారత్‌లో 1,400 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న డీసీలు ఏర్పాటయ్యాయి. వీటి సామర్ధ్యం 2027 నాటికి రెట్టింపై, 2030 నాటికి ఐదు రెట్లు పెరుగుతుందని మక్వేరీ ఈక్విటీ రీసెర్చ్‌.. ‘రాక్స్‌ టు రిచెస్‌: ఇండియా డేటా సెంటర్స్‌’ పేరుతో రూపొందించిన నివేదికలో తెలిపింది. దేశంలో ఇప్పటికే 1,400 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు కార్యకలాపాలు సాగిస్తుండగా మరో 1,400 మెగావాట్ల సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు దాదాపు 5,000 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. సర్వర్ల ఖర్చులు పక్కన పెట్టినా ఒక మెగావాట్‌ సామర్ధ్యం ఉన్న డేటా కేంద్రం ఏర్పాటుకు 40 లక్షల నుంచి 70 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. దీంతో 2030 నాటికి డేటా సెంటర్ల ద్వారానే మన దేశం 3,000 కోట్ల డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇందులో గూగుల్‌ కంపెనీ ఒక్కటే అదానీ గ్రూప్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద 1,500 కోట్ల డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా కేంద్రం, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనుంది. దేశంలో డేటా కేంద్రాల ఏర్పాటుకు దోహదం చేసే అంశాలేమిటంటే..

  • డేటా లోకలైజేషన్‌ చట్టాలు

  • కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల విధానాలు, రాయితీలు

  • కంపెనీలు వేగంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు మారడం

  • ఓటీటీ కంటెంట్‌, మొబైల్‌ డేటాకు పెరుగుతున్న డిమాండ్‌

  • పెరుగుతున్న డిజిటల్‌ నేటివ్‌ వ్యాపారాలు

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 06:03 AM