Stock Market Volatility: మార్చి వరకు మార్కెట్లో ఆటుపోట్లే
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:02 AM
వచ్చే ఏడాది మార్చి వరకు భారత స్టాక్ మార్కెట్లో ఆటుపోట్లు తప్పక పోవచ్చని జియోబ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వె్‌స్టమెంట్ ఆఫీసర్ (సీఐఓ) రిషి కోహ్లి అన్నారు. అయితే మార్చి తర్వాత...
కోల్‌కతా: వచ్చే ఏడాది మార్చి వరకు భారత స్టాక్ మార్కెట్లో ఆటుపోట్లు తప్పక పోవచ్చని జియోబ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వె్‌స్టమెంట్ ఆఫీసర్ (సీఐఓ) రిషి కోహ్లి అన్నారు. అయితే మార్చి తర్వాత మార్కెట్ కోలుకోవడం ప్రారంభిస్తుందని తెలిపారు. సూక్ష్మ, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్టు కోహ్లి చెప్పారు. ‘గత ఏడాది కాలంలో మన మార్కెట్ అనేక ఆటుపోట్లను చవి చూసిందన్నారు. గడ్డు కాలం అయిపోయినట్టు కనిస్తోంది. అయినా ఇంకా ఒకటి రెండు త్రైమాసికాలపాటు ఈ కష్టాలు, ఆటుపోట్లు తప్పకపోవచ్చు’ అని కోహ్లి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News