Stock Market: 82 వేలు దాటిన సెన్సెక్స్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:25 AM
వరుసగా ఐదో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 82 వేల మార్క్ దాటేసింది. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ నిఫ్టీ 25 వేల మైలురాయిని చేరుకోవడం విశేషం.
వరుసగా ఐదో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 82 వేల మార్క్ దాటేసింది. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ నిఫ్టీ 25 వేల మైలురాయిని చేరుకోవడం విశేషం. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
మంగళవారం ముగింపు (81, 926)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 30 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఒక దశంలో 250 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో 82, 055 వద్ద కొనసాగుతోంది. మళ్లీ 82 వేల మార్క్‌కు చేరుకుంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 29 పాయింట్ల లాభంతో 25, 137 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో టైటాన్ కంపెనీ, ఎస్బీఐ కార్డ్, హిటాచీ ఎనర్జీ, నాల్కో, టీసీఎస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేన్స్ టెక్నాలజీస్, ఏబీ క్యాపిటల్, కెనరా బ్యాంక్, నైకా, గ్లన్‌మార్క్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 207 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.77గా ఉంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి