Stock Market: 25 వేలు దాటిన నిఫ్టీ.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:22 AM
దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు సానుకూలాంశంగా మారడంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు సానుకూలాంశంగా మారడంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ నిఫ్టీ 25 వేల మైలురాయిని చేరుకోవడం విశేషం. మరోవైపు ఐపీవో జోష్ కూడా సూచీలను ముందుకు నడిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి. (Indian stock market).
సోమవారం ముగింపు (81, 790)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 70 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 82, 134 వద్ద కొనసాగుతోంది. మళ్లీ 82 వేల మార్క్‌కు చేరుకుంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 100 పాయింట్ల లాభంతో 25, 177 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో సీడీఎస్‌ఎల్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, పీబీ ఫిన్‌టెక్, జియో ఫైనాన్సియల్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్స్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 162 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.73గా ఉంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి