Stock Market: బీహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏ హవా.. సూచీలకు భారీ లాభాలు..
ABN , Publish Date - Nov 12 , 2025 | 10:43 AM
భారత్‌పై విధించిన సుంకాలను భారీగా తగ్గించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచీలకు కలిసి వచ్చింది. అలాగే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల కూడా కలిసి రావడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
మంగళవారం ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అలాగే భారత్‌పై విధించిన సుంకాలను భారీగా తగ్గించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా సూచీలకు కలిసి వచ్చింది. అలాగే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల కూడా కలిసి రావడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (83, 871)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 450 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 567 పాయింట్ల లాభంతో 84, 439 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 161 పాయింట్ల లాభంతో 25, 856 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో బీఎస్‌ఈ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్, క్యామ్స్, టాటా ఎలాక్సీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). టొరెంట్ పవర్, ఫోర్టిస్ హెల్త్, పీఐ ఇండస్ట్రీస్, వరుణ్ బేవరేజెస్, ముత్తూట్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 309 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.58గా ఉంది.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..