Share News

Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:30 AM

సోమవారం ఓ మోస్తారు లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే ఆరంభ లాభాలు ఆవిరై సూచీలు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వల్ల కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.

Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

సోమవారం ఓ మోస్తారు లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే ఆరంభ లాభాలు ఆవిరై సూచీలు నష్టాల బాట పట్టాయి. వివిధ కంపెనీలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు నిరాశజనకంగా ఉండడం, భవిష్యత్తు టార్గెట్‌ను కూడా తగ్గించడం వల్ల మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వల్ల కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (83, 535)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:25 గంటల సమయంలో సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంతో 83, 259 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 83 పాయింట్ల నష్టంతో 25, 491 వద్ద కొనసాగుతోంది (stock market news today).


సెన్సెక్స్‌లో వోడాఫోన్ ఐడియా, పెర్సిస్టెంట్, అంబార్ ఎంటర్‌ప్రైజెస్, సోలార్ ఇండస్ట్రీస్, భారత్ డైనమిక్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, బ్రిటానియా, హడ్కో, ఏబీ క్యాపిటల్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 150 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.70గా ఉంది.


ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 10:30 AM