Stock Market: ఒడిదుడుకుల్లో సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:35 AM
బుధవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్సియల్ రంగంలో అమ్మకాలు సూచీలకు నెగిటివ్‌గా మారాయి. దీంతో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఒక దశలో 82 వేల మార్క్ దాటిన సెన్సెక్స్ మళ్లీ కిందకు దిగి వచ్చింది.
బుధవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్సియల్ రంగంలో అమ్మకాలు సూచీలకు నెగిటివ్‌గా మారాయి. దీంతో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఒక దశలో 82 వేల మార్క్ దాటిన సెన్సెక్స్ మళ్లీ కిందకు దిగి వచ్చింది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
బుధవారం ముగింపు (81, 773)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 130 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో వంద పాయిట్లు ఆర్జించి 82 వేల మార్క్‌ను దాటింది. అయితే కాసేపటికే ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 81, 829 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 37 పాయింట్ల లాభంతో 25, 083 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అరబిందో ఫార్మా, లూపిన్, ప్రెస్టేజ్ ఎస్టేట్, టాటా స్టీల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇన్ఫోఎడ్జ్, యూనో మిండా, పీబీ ఫిన్‌టెక్, రైల్ వికాస్, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 327 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.78గా ఉంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి