Stock Market: నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:45 PM
ఆటో, మెటల్ రంగాలపై చాలా మంది ఆసక్తిగా ఉండడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త కోలుకోవడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా రోజును ముగించాయి
గత మూడు సెషన్లుగా వరుసగా సూచీలు నష్టపోతుండడంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అలాగే ఆటో, మెటల్ రంగాలపై చాలా మంది ఆసక్తిగా ఉండడం కూడా సూచీలకు కలిసొచ్చింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త కోలుకోవడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 695)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభనష్టాలతో దోబూచులాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మాకలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 250 పాయింట్లు నష్టపోయి 84, 675 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే చివర్లో కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 84, 675 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 25, 938 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో సెయిల్, నాల్కో, జిందాల్ స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, ఇండియన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). అంబర్ ఎంటర్‌ప్రైజెస్, సోలార్ ఇండస్ట్రీస్, ఎంజెల్ వన్, మాజగాన్ డాక్, ఎన్‌సీసీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 238 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 87 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.79గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..
వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..