Share News

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. భారీగా లాభపడిన సెన్సెక్స్..

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:05 PM

మంగళవారం విదేశీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు జరపడం మదుపర్లు సెంటిమెంట్‌ను పెంచింది. అలాగే హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను భారీగా లాభాల వైపు నడిపించాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోవడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి.

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. భారీగా లాభపడిన సెన్సెక్స్..
stock market news

గత రెండు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి. భారీ లాభాలను ఆర్జించాయి. మంగళవారం విదేశీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు జరపడం మదుపర్లు సెంటిమెంట్‌ను పెంచింది. అలాగే హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను భారీగా లాభాల వైపు నడిపించాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోవడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (84, 587)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. చివర్లో కొనుగోళ్లు మరింత పెరగడంతో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పెరిగింది. చివరకు సెన్సెక్స్ 1022 పాయింట్ల లాభంతో 85, 609 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 320 పాయింట్ల లాభంతో 26, 205 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, నవుమా వెల్త్, సైమన్స్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, పీఎన్‌బీ హౌసింగ్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). నైకా, భారతీ ఎయిర్‌టెల్, పీఐ ఇండస్ట్రీస్, ఎల్‌ఐసీ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 763 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 707 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.27గా ఉంది.


ఇవీ చదవండి:

డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!

మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!

Updated Date - Nov 26 , 2025 | 04:06 PM