Share News

Jaishankar: ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‎పై ట్రంప్ వ్యాఖ్యలు..జైశంకర్ కౌంటర్..

ABN , Publish Date - May 15 , 2025 | 09:15 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ఇండియా-అమెరికా సంబంధాలను చర్చనీయాంశంగా మార్చాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ స్పందించారు.

Jaishankar: ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‎పై ట్రంప్ వ్యాఖ్యలు..జైశంకర్ కౌంటర్..
Jaishankar Response

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇండియా-అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా తమతో "జీరో టారిఫ్" ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జై శంకర్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఇవి సంక్లిష్టమైనవని జైశంకర్ పేర్కొన్నారు. ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునే వరకు ఏమి చెప్పలేమన్నారు. ఏ ట్రేడ్ డీల్ అయినా ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చాలన్నారు. ఇది రెండు దేశాలకు సమానంగా పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్నీ ఖరారు కాకముందే ప్రకటన చేయడం మాట జారినట్లే అవుతుందని జై శంకర్ వెల్లడించారు.


అసలు ట్రంప్ ఏమన్నారు

మధ్య ప్రాచ్యంలో మూడు దేశాల పర్యటనలో భాగంగా దోహాలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఆ క్రమంలో ఇండియాలో వ్యాపారం చేయడం చాలా కష్టం. కానీ, వారు మాకు ఒక డీల్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో వారు మాకు ఎటువంటి టారిఫ్‌లు విధించరని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌పై కొత్త ఊహాగానాలకు తెరతీశాయి. అంతేకాదు, ఆపిల్ కంపెనీ ఇండియాలో తమ ఉత్పత్తుల తయారీని విస్తరించడంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో నేను మాట్లాడాను. చైనాలో ఫ్యాక్టరీలు నడిపిన ఆపిల్‌కు మేం చాలా సపోర్ట్ చేశాం. కానీ, ఇప్పుడు ఇండియాలో ఫ్యాక్టరీలు కట్టడం మాకు ఇష్టం లేదు. అమెరికాలోనే ఫ్యాక్టరీలు కట్టాలని ఆయన చెప్పారు.


ఇండియా-అమెరికా ట్రేడ్

ప్రస్తుతం అమెరికా ఇండియాకు అతిపెద్ద ట్రేడింగ్ భాగస్వామిగా ఉంది. 2024 డేటా ప్రకారం, ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 129 బిలియన్ డాలర్లు. ఇందులో ఇండియాకు 45.7 బిలియన్ డాలర్ల సర్ల్పస్ ఉంది. ఈ చర్చల ద్వారా 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందం ఇండియా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఎగుమతులకు ఊతం ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్లలో ఉత్సాహం

ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే భారత ఈక్విటీ మార్కెట్లు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఈ ఒప్పందం ఇండియా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఎగుమతి రంగానికి ఊతం ఇస్తుందనే ఆశాభావం మార్కెట్లలో కనిపించింది. ఈ నేపథ్యంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం మే 17 నుంచి 20 మధ్య అమెరికా వెళ్లే ఛాన్సుంది.


Also Read:

SJaishankar: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు


ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

చైనాకు బుద్ధి చెప్పిన భారత్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 15 , 2025 | 09:42 PM