EV Charging Stations India: రూ 2000 కోట్లతో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:55 AM
విద్యుత్ వాహనాల వ్యాప్తికి సమస్యగా మారిన చార్జింగ్ స్టేషన్ల విస్తరణకు కేంద్ర ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 72,300కు పైగా...
దేశవ్యాప్తంగా 72,300 స్టేషన్లు; నోడల్ ఏజెన్సీగా భెల్.. కేంద్రం మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల వ్యాప్తికి సమస్యగా మారిన చార్జింగ్ స్టేషన్ల విస్తరణకు కేంద్ర ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 72,300కు పైగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పా,టు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎం-ఈ డ్రైవ్ కింద ఏర్పా టు చేసిన రూ.10,900 కోట్ల ప్రత్యేక నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తారు. భెల్‌ను ఈ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా నియమించారు.
ప్రధాన మార్గదర్శకాలు
ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు పూర్తి సబ్సిడీ.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కింద నగరాలు, రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల యంత్ర పరికరాలపై 70% నుంచి 80% సబ్సిడీ.
నగరాల్లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్‌ల వద్ద ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల పరికరాల ధరపై 80ు వరకు సబ్సిడీ.
బ్యాటరీ స్వాపింగ్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 80ు వరకు సబ్సిడీ.
నిబంధనల అమలు, పనితీరు ఆధారంగా సబ్సిడీ విడుదల.
పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ నగరాలు, మెట్రోతో అనుసంధానమైన పట్టణాలు, రాష్ట్రాల రాజధానులు, జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత.
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి