Pharma Exports: ఫార్మా ఎగుమతుల్లో 5 శాతం వృద్ధి
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:44 AM
అనిశ్చిత పరిస్థితుల్లోనూ భారత ఫార్మా ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత్ నుంచి 757 కోట్ల డాలర్ల (సుమారు రూ.65,860 కోట్లు) విలువైన...
జూన్ త్రైమాసికంలో రూ.65,860 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల్లోనూ భారత ఫార్మా ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత్ నుంచి 757 కోట్ల డాలర్ల (సుమారు రూ.65,860 కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5.21 శాతం ఎక్కువ. ఫార్ములేషన్లు, బయోలాజిక్స్ విభాగాలు ఎగుమతులు పెరిగేందుకు బాగా దోహదం చేశాయి. కాగా ఇదే కాలంలో విదేశాల నుంచి మన దేశానికి దిగుమతయ్యే ఫార్మా ఉత్పత్తులు 4.21 శాతం పెరిగి 78.6 కోట్ల డాలర్లకు చేరినట్టు ఫార్మెగ్జిల్ చైర్మన్ నమిత్ జోషి చెప్పారు. జూన్ త్రైమాసికంలో భారత్‌కు దిగుమతైన ఫార్మా ఉత్పత్తుల్లో 46 శాతం బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియరీలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిడి, టారిఫ్ సమస్యలు ఉన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా త్రైమాసికాల్లోనూ ఎగుమతుల వృద్ధి రేటు కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత్ నుంచి 3,047 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.65 లక్షల కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 9.39 శాతం ఎక్కువ.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News