Dibang Dam Arunachal: చైనాకు కౌంటర్‌గా ఎత్తైన డ్యామ్
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:17 AM
చైనా మెగా ప్రాజెక్టుకు కౌంటర్‌గా అరుణాచల్‌ప్రదేశ్‌లో చేపట్టనున్న అతిపెద్ద డ్యామ్ దిబాంగ్ బహుళార్ధసాధక ప్రాజెక్టు పనులను భారత్ ప్రారంభించింది....
అరుణాచల్‌లో దిబాంగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: చైనా మెగా ప్రాజెక్టుకు కౌంటర్‌గా అరుణాచల్‌ప్రదేశ్‌లో చేపట్టనున్న అతిపెద్ద డ్యామ్ దిబాంగ్ బహుళార్ధసాధక ప్రాజెక్టు పనులను భారత్ ప్రారంభించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ రూ.17,069 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు టిబెట్ భూభాగంలోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై చైనా ఒక మెగా ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
భారత్ చేపట్టిన ప్రాజెక్టు.. చైనా డ్యామ్ నుంచి ఒకవేళ అకస్మాత్తుగా నీరు విడుదలైతే ఒక అడ్డుగోడలా నిలుస్తుందని, భారత భూభాగాలు వరద బారిన పడకుండా కాపాడుతుందని భావిస్తున్నారు. భారత వ్యూహాత్మక భద్రతలో భాగమైన ఈ దిబాంగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని టెండర్ ప్రకారం 91 నెలల్లో పూర్తి చేయాలని, 2032 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎన్‌ఎన్-న్యూస్18 నివేదించింది. 278 మీటర్ల ఎత్తులో ఇది దేశంలోనే ఎత్తైన ఆనకట్ట కానుంది. దీని ద్వారా ఏడాదికి 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. 2,880 మెగావాట్ల దిబాంగ్ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు ప్రధాని మోదీ గతేడాది శంకుస్థాపన చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News