Share News

India US trade deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాలు భారీగా తగ్గనున్నాయా..

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:53 AM

గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.

India US trade deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాలు భారీగా తగ్గనున్నాయా..
India US trade deal

గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇక, రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో ట్రంప్ మరో 25 శాతం సుంకాలు విధించారు (tariff reduction India).


ప్రస్తుతం భారత్ ఎగుమతులపై అమెరికాలో 50 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. అయితే భారత్-అమెరికా మధ్య ఎన్నో రోజులుగా జరుగుతున్న వాణిజ్య చర్యలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడ్ డీల్‌తో భారత్‌పై అమెరికా సుంకాలు భారీగా తగ్గబోతున్నాయట. ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 15-16 శాతానికి తగ్గే వీలుందట. నవంబర్ 30 తర్వాత ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావచ్చొని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు (US imports India tariffs).


ఈ ట్రేడ్ డీల్‌ కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే ప్రయత్నంలో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది (bilateral trade India US 2025). ప్రస్తుతం భారత్ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతంగా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించనుందని సమాచారం.


అమెరికాలో భారీగా పండే మొక్కజొన్న దిగుమతులను చైనా ఇటీవల భారీగా తగ్గించుకుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం భారత్‌ వైపు అమెరికా చూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న, సోయామీల్‌ను భారత్‌లోకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..


మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2025 | 10:53 AM