Share News

India Semiconductor Mission: సెమీకండక్టర్లలో ప్రపంచ శక్తి అవుతాం

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:21 AM

ప్రస్తుతం దేశంలో 1,800 కోట్ల డాలర్ల (రూ.1.57 లక్షల కోట్లు) విలువ గల 10 సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం.. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ తదుపరి దశలోకి పురోగమిస్తోందన్నారు...

India Semiconductor Mission: సెమీకండక్టర్లలో ప్రపంచ శక్తి అవుతాం

సెమికాన్‌ ప్రారంభ సదస్సులో మోదీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో 1,800 కోట్ల డాలర్ల (రూ.1.57 లక్షల కోట్లు) విలువ గల 10 సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం.. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ తదుపరి దశలోకి పురోగమిస్తోందన్నారు. త్వరలో లక్ష కోట్ల డాలర్ల (రూ.87 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందనుకుంటున్న ప్రపంచ చిప్‌ మార్కెట్లో అవకాశాలు సొమ్ము చేసుకునేందుకు వీలుగా డిజైన్‌ ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మరిన్ని మెరుగుదలతో తీర్చిదిద్దనున్నట్టు మంగళవారం ఇక్కడ సెమికాన్‌-2025 ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. ‘‘చమురును నల్ల బంగారం అని పిలుస్తారు. చిప్‌లు డిజిటల్‌ వజ్రాలు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్ది శక్తి అంతా ఒక చిన్న చిప్‌లో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. భారత్‌లో తయారైన చిన్న చిప్‌ ప్రపంచంలో పెద్ద మార్పు తెచ్చే రోజు ఎంతో దూరంలో లేదంటూ ‘‘భారత్‌లో డిజైన్‌ అయి, భారత్‌లో తయారై, ప్రపంచం విశ్వసిస్తున్న’’ చిప్‌ అని ప్రపంచం యావత్తు మన దేశం గురించి ఘోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


ప్రోత్సాహకాలు కొనసాగుతాయి

దేశంలో అమల్లో ఉన్న కీలకమైన సెమీకండక్టర్‌ ప్రాజెక్టులకు మొత్తం ఉత్పత్తి వ్యయంలో 70ు ప్రోత్సాహకాలు యధావిధిగా అందుతాయని ఎలక్ర్టానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ చెప్పారు. సెమీకండక్టర్‌ ప్రాజెక్టులకు భారత్‌ అందిస్తున్న ప్రోత్సాహం కనివిని ఎరుగనిదంటూ సుమారు 3,000 కోట్ల డాలర్ల (రూ.2.61 లక్షల కోట్లు) విలువ గల ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 03:21 AM