IMF Increases India Growth Forecast ఈ ఏడాది వృద్ధి ఐఎంఎఫ్
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:33 AM
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన వృద్ధి అంచనాను 6.4ు నుంచి 6.6 శాతానికి పెంచింది. అమెరికా విభిన్న వస్తువులపై సుంకాలు...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన వృద్ధి అంచనాను 6.4ు నుంచి 6.6 శాతానికి పెంచింది. అమెరికా విభిన్న వస్తువులపై సుంకాలు గణనీయంగా పెంచినప్పటికీ తొలి త్రైమాసికంలో ప్రైవేట్ వినియోగం ప్రభావంతో సాధించిన బలమైన వృద్ధి ఏడాది మొత్తానికి ఆసరాగా నిలుస్తుందని తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2025-26 సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8ు బలమైన వృద్ధిని నమోదు చేసిన విష యం విదితమే. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన జీఎ్‌సటీ సంస్కరణలతో దేశీయ డిమాండ్ మరింతగా పెరుగుతుందని, అమెరికా టారి్‌ఫల ప్రతికూల ప్రభావాన్ని ఇది భర్తీ చేస్తుందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News