ICICI Prudential AMC IPO: 12 నుంచి ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ఐపీఓ
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:57 AM
ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. ఇష్యూ పరిమాణం రూ.10,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఇష్యూ పూర్తిగా....
ఇష్యూ ధర రూ.2,061-2,165
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. ఇష్యూ పరిమాణం రూ.10,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) రూపంలో ఉండనుంది. ఓఎ్‌ఫఎ్‌సలో భాగంగా సంస్థ ప్రమోటర్ యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ 10 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. కంపెనీ మార్కెట్ విలువను రూ.1.07 లక్షల కోట్లుగా లెక్కకట్టారు. కాగా ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.2,061-2,165గా కంపెనీ ఖరారు చేసింది. ఐసీఐసీఐ గ్రూప్ నుంచి మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఐదో సంస్థ ఇది. కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ లేకపోవటంతో సంస్థకు ఎలాంటి మూలధనం సమకూరే అవకాశం లేదు. ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రు ఏఎంసీలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉండగా ప్రుడెన్షియల్ కార్పొరేషన్‌కు 49 శాతం వాటా ఉంది. ఈ ఐపీఓతో ఐసీఐసీఐ ప్రు.. భారత స్టాక్ మార్కెట్లో లిస్టయిన హెచ్‌డీఎ్‌ఫసీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లై్‌ఫ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పాన్ ఇండియా ఏఎంసీ సరసన చేరనుంది.
ఇవి కూడా చదవండి
బెంగాల్‌లో బాబ్రీ మోడల్ మసీదు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన
గుండె ఆగిపోయే స్టంట్.. కారుతో ఇతను చేసిన విన్యాసాలు చూస్తే..
Read Latest AP News and National News