Share News

IBM Confluent Acquisition: ఐబీఎం గూటికి కాన్‌ఫ్లుయెంట్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:19 AM

అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ఐబీ ఎం మరో భారీ కొనుగోలు జరిపింది. డేటా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కాన్‌ఫ్లుయెంట్‌ను 1,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.లక్ష కోట్లు) దక్కించుకుంది....

IBM Confluent Acquisition: ఐబీఎం గూటికి కాన్‌ఫ్లుయెంట్‌

ఒప్పందం విలువ రూ.1 లక్ష కోట్లు

న్యూయార్క్‌: అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ఐబీ ఎం మరో భారీ కొనుగోలు జరిపింది. డేటా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కాన్‌ఫ్లుయెంట్‌ను 1,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.లక్ష కోట్లు) దక్కించుకుంది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ డీల్‌లో భాగంగా కాన్‌ఫ్లుయెంట్‌కు చెందిన ఒక్కో షేరుకు ఐబీఎం 31 డాలర్లు చెల్లించనుంది. 2026 ప్రథమార్ధం చివరినాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావచ్చని అంచ నా. కాన్‌ఫ్లుయెంట్‌ కొనుగోలు తమ కృత్రిమ మేధ (ఏఐ) సేవల సామర్థ్యాన్ని మరింత పెంచనుందని ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ అన్నారు. ఈ డీల్‌ నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లో కాన్‌ఫ్లుయెంట్‌ షేరు సోమవారం ఒకదశలో 26 శాతం ఎగబాకగా.. ఐబీఎం స్టాక్‌ 1 శాతం తగ్గింది. గడిచిన రెండేళ్లలో ఐబీఎం జరిపిన మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీ ఇది.

ఇవీ చదవండి:

ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్

ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2025 | 06:19 AM