Share News

Hyderabad Tech Jobs: టెకీలకు హైదరాబాద్‌లో భలే గిరాకీ

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:23 AM

టెక్నాలజీ ఉద్యోగాల ముఖచిత్రం మారిపోతోంది. గతంలో టెక్నాలజీ జాబ్స్‌ అంటే బెంగళూరు. ఇప్పుడు ఈ విషయంలో హైదరాబాద్‌.. భారత సిలికాన్‌ వ్యాలీగా పిలిచే బెంగళూరును మించిపోయింది...

Hyderabad Tech Jobs: టెకీలకు హైదరాబాద్‌లో భలే గిరాకీ

హైదరాబాద్‌: టెక్నాలజీ ఉద్యోగాల ముఖచిత్రం మారిపోతోంది. గతంలో టెక్నాలజీ జాబ్స్‌ అంటే బెంగళూరు. ఇప్పుడు ఈ విషయంలో హైదరాబాద్‌.. భారత సిలికాన్‌ వ్యాలీగా పిలిచే బెంగళూరును మించిపోయింది. నిన్న మొన్నటి వరకు బ్యాక్‌ ఎండ్‌ ఉద్యోగాలకే పరిమితమైన హైదరాబాద్‌ తాజా గా ఫ్రంట్‌లైన్‌ టెక్నాలజీ ఉద్యోగాలకూ కేంద్రంగా మారుతోంది. డేటా ఇంజనీరింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ), ఆర్‌ అండ్‌ డీ రంగాల్లో ఈ ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రంగాలకు చెందిన సీనియర్లకు కంపెనీలు జీతాలు కూడా బాగానే ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలర్లకు హైదరాబాద్‌లో సగటున రూ.30.4 లక్షల వరకు కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువని కంపెనీలకు నియామకాల సేవలు అందించే టీమ్‌లీజ్‌ తెలిపింది. ఇదే సమయంలో బెంగళూరులో జీతాల వృద్ధి రేటు 5.6 శాతం మాత్రమే. డేటా ఇంజనీరింగ్‌, ఆర్‌ అండ్‌ రంగాల్లో పనిచేసే టెకీల సగటు జీతాలూ హైదరాబాద్‌లో గత ఏడాది కాలంలో 11.1 శాతం పెరిగి రూ.20 లక్షలకు చేరాయి. బెంగళూరుతో పోలిస్తే ఇది 4.6 శాతం ఎక్కువ.

బెంగళూరు కంటే ఎక్కువ జీతాలు

కలిసి వస్తున్న అంశాలు

  • బెంగళూరుతో పాటు హైదరాబాద్‌ వైపు చూస్తున్న టెక్‌ కంపెనీలు

  • బెంగళూరుతో సమానంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు

  • ప్రభుత్వ సానుకూల విధానాలు

  • టాప్‌ టాలెంట్‌ను ప్రధాన నగరాలన్నిటిలోనూ మోహరించాలనే కంపెనీల విధానం

  • ఏటా మూడు లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల అందుబాటు

  • దేశ డిజిటల్‌ టెక్‌ నైపుణ్యాల్లో 14 శాతం హైదరాబాద్‌లో లభించడం

  • హైదరాబాద్‌లో పెరుగుతున్న జీసీసీలు

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:23 AM