Hyderabad ORR: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ ద్వారా ఆగస్టులో రూ 74 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:32 AM
హైదరాబాద్ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా కంపెనీకి కనకవర్షం కురిపిస్తోంది. ఆగస్టు నెలలో ఈ రహదారి టోల్ వసూళ్లు రూ.73.7 కోట్లకు చేరాయు. గత ఏడాది ఇదే కాలంతో...
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా
న్యూఢిల్లీ:హైదరాబాద్ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా కంపెనీకి కనకవర్షం కురిపిస్తోంది. ఆగస్టు నెలలో ఈ రహదారి టోల్ వసూళ్లు రూ.73.7 కోట్లకు చేరాయు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.5 కోట్లు ఎక్కువని కంపెనీ తెలిపింది. 2023 ఆగస్టులో హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు చెల్లించడం ద్వారా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఈ రహదారిపై 30 ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకునే హక్కులు పొందింది. గత నెల ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా కి దేశంలోని 17 టోల్‌వే ప్రాజెక్టుల ద్వారా రూ.563 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో అత్యధికంగా రూ.147.7 కోట్లు మహారాష్ట్రలోని టోల్‌వేస్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత రూ.73.7 కోట్లు ఐఆర్‌బీ గోల్కోండ ఎక్స్‌ప్రె్‌సవే (హైదరాబాద్ ఓఆర్‌ఆర్) ద్వారా సమకూరింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి