Viona Fintech Enters UPI Payments: యూపీఐ చెల్లింపుల్లోకి వియోనా ఫిన్‌టెక్
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:36 AM
థర్డ్‌పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా (టీపీఏపీ) సేవలందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతి లభించిందని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): థర్డ్‌పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా (టీపీఏపీ) సేవలందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతి లభించిందని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వియోనా ఫిన్‌టెక్ ప్రకటించింది. దీనివల్ల భాగస్వామ్య బ్యాంకులతో కలిసి తాము యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు అందించగలుగుతామని, తద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మరింతగా విస్తరించే అవకాశం లభిస్తుందని వియోనా ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ యార్లగడ్డ తెలిపారు. వియోనా తన గ్రామ్‌పే డిజిటల్ మాధ్యమం ద్వారా నిరంతరాయంగా చెల్లింపులు, వసూళ్లు నిర్వహిస్తూ రైతులు, చిన్న వ్యాపారులు, స్థానిక సామాజిక వర్గాలకు సాధికారత కల్పిస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు సేవలు మరింత విస్తరించే లక్ష్యంతో వియోనా గ్రామ్‌పే వేదికపై రైతుల మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేసింది. దీన్ని ఉపయోగించుకుని రైతులు వేగవంతంగా లావాదేవీలు నిర్వహించుకుంటూ తమ ఉత్పత్తులకు మెరుగైన గిట్టుబాటు ధరలు పొందగలుగుతారని వియోనా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి