Free online complaint resolution RBI: బ్యాంకింగ్ సేవల్లో సమస్యలున్నాయా
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:33 AM
ప్రస్తుతం రోజువారీ జీవితంలో ఆర్థిక లావాదేవీలు నిత్యకృత్యమై పోయాయి. అవి బ్యాంకుల ద్వారా కావచ్చు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎ్‌ఫసీలు) లేదా డిజిటల్ పేమెంట్స్ కావచ్చు. టెక్నాలజీ పుణ్యమాని వీటి సేవలు ఎంత సులభమయ్యాయో...
ఆర్‌బీఐకి ఫిర్యాదు చేస్తే సరి
ప్రస్తుతం రోజువారీ జీవితంలో ఆర్థిక లావాదేవీలు నిత్యకృత్యమై పోయాయి. అవి బ్యాంకుల ద్వారా కావచ్చు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎ్‌ఫసీలు) లేదా డిజిటల్ పేమెంట్స్ కావచ్చు. టెక్నాలజీ పుణ్యమాని వీటి సేవలు ఎంత సులభమయ్యాయో.. అదే సమయంలో సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలపై సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండదు. ఉన్నా.. అది మొక్కుబడిగానే ఉంటోంది. అయితే వీటన్నిటికి పరిష్కారం చూపేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. లావాదేవీలు లేదా ఇతరత్రా బ్యాంకింగ్ సమస్యలు ఏమైనా ఉంటే ఖాతాదారులకు తన కంప్లయెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆర్‌బీఐ పరిష్కారం చూపుతోంది. ఆ వివరాలు మీకోసం..
ఎప్పుడు ఫిర్యాదు చేయాలి?
సేవల్లో లోపాలు ఉంటే ముందు సంబంధిత బ్యాంకు, ఎన్‌బీఎ్‌ఫసీ లేదా డిజిటల్ పేమెంట్ చానల్ పార్ట్‌నర్ కే ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదును సంబంధిత సంస్థలు నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ నెల రోజుల్లో వాటి నుంచి సమాధానం రాకపోయినా, వచ్చినా వారి సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా నేరుగా ఛిఝట.టఛజీ.ౌటజ.జీుఽ పోర్టల్ ద్వారా ఆర్‌బీఐ కి ఫిర్యాదు చేయవచ్చు.
పరిష్కార ప్రక్రియ
మీ ఫిర్యాదు అందిన వెంటనే ఆర్‌బీఐ.. పరిష్కారం కోసం సంబంధిత సంస్థలకు పంపిస్తుంది. సంబంధిత సంస్థలు దీనికి నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వాలి. సమాధానం రాకుంటే అంబుడ్స్‌మన్ రంగంలోకి దిగుతుంది. ఇందుకు మీ నుంచి మరింత సమాచారం అవసరమైతే అడుగుతుంది. అవసరమనుకుంటే సంబంధిత సంస్థ, ఫిర్యాదు చేసిన ఖాతాదారుడి మఽధ్య అంబుడ్స్‌మన్ మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కరిస్తుంది. సీఎంఎస్ పోర్టల్ ద్వారా అందే ఫిర్యాదుల్లో చాలా వరకు నెల రోజుల్లో పరిష్కారమవుతాయి. మధ్యవర్తిత్వం విఫలమైతే అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం మీకు అంగీకారమైతే సంబంధిత సంస్థలు నెల రోజుల్లోగా కచ్చితంగా దాన్ని అమలు చేయాలి.
నచ్చకపోతే ?
అంబుడ్స్‌మన్ తీర్పు ఫిర్యాదుదారుడికి నచ్చితే సరి. లేకపోతే తీర్పు వెలువడిన నెల రోజుల్లోగా ఆర్‌బీఐకే చెందిన అప్పిల్లేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ సంస్థ తీర్పు కూడా నచ్చకపోతే ఫిర్యాదుదారుడు కన్స్యూమర్ కోర్టు లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
అంతా ఉచితం
ఆర్‌బీఐ సీఎంఎస్ పోర్టల్ సేవలు పూర్తిగా ఉచితం. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు లేదా పేమెంట్ చానల్స్ ఆఫీసు మెట్లు ఎక్కకుండానే మీ ఫిర్యాదులను ఈ పోర్టల్ ద్వారా ఉచితంగా పరిష్కరించుకోవచ్చు. కాకపోతే అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉండాలి.
ఏ వివరాలు ఇవ్వాలి?
ఫిర్యాదులో మీ పేరు, ఫోన్ నంబరు, చిరునామా, సమస్య ఉన్న బ్యాంకు, ఎన్‌బీఎ్‌ఫసీ వివరాలు, సమస్య వివరాలు ఇవ్వాలి. సమస్య పరిష్కారం కోసం ఆయా సంస్థలతో మీరు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్లు, స్ర్కీన్ షాట్ల వివరాలను కూడా అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా మీకు ఒక రిఫరెన్స్ నంబరు జనరేట్ అవుతుంది.
వేటిపై ఫిర్యాదు చేయవచ్చు?
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పరిధిలోకి వచ్చే ఈ కింది అంశాలన్నిటిపైనా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
సేవా లోపాలు
చెల్లింపుల్లో ఆలస్యం లేదా అసలు చెల్లించకపోవడం
పొరపాటుగా డెబిట్ చేసిన మొత్తాన్ని తిరిగి బదిలీ చేయకపోవడం
ఏటీఎం లేదా యూపీఐ లావాదేవీలు విఫలమవడం
మీ ఖాతా నుంచి అనఽధికారికంగా డెబిట్ చేయడం
రుణాల మంజూరు, చెల్లింపుల్లో సమస్యలు
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి